పట్టణంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు.
ప్రజా గొంతుక చేర్యాల:: పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నాలుగో వార్డ్ అభ్యర్థిగా నిమ్మ సుప్రజా రాజీవ్ రెడ్డి దాదాపు 150 మందికి పైగా భారీ తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అంతకుముందు నాలుగో వార్డ్ లో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించుకోవాలని సుప్రజ అన్నారు. అంతకుముందు సినిమా హాల్ దగ్గరలో ఉన్న చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం నామినేషన్ సెంటర్ దగ్గరకు వచ్చి నామినేషన్ దాకలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.












