E-PAPER

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

Date : 29 January 2026, 5:16 pm Posted By : PRAJA GONTHUKA

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. .....

ఫైరింగ్ సాంప్రదాయాన్నిపై ప్రభుత్వంతో చర్చ...

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములకనూరు సమ్మక్క–సారలమ్మ జాతరను స్థానిక నాయకులు, భక్తులు ఐక్యంగా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. జాతర సమయంలో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చే వేళ ఫైరింగ్ సంప్రదాయం గతంలో కొనసాగిందని, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు డీజీపీ, సీపీతో చర్చించి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించిందన్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవార్లకు స్వాగతంగా ఫైరింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సంప్రదాయమని, గత 44 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ప్రభుత్వం గౌరవం ఇచ్చిందన్నారు. లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు..ప్రాంతంలో సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులు, అంజి వర్గాల ప్రజలపై అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు కింది స్థాయి ప్రజల వరకు నిరాటంకంగా చేరాలని అమ్మవార్లను వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈకార్యక్రమంలో ముల్కనూరు గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య, ఉపసర్పంచ్ కాసగోని మమత బాలకృష్ణ, జంగం పూర్ణచందర్, పొన్నం సత్యం, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, జక్కుల మల్లికార్జున, జక్కుల అనిల్, పోగుల శ్రీకాంత్, పోలీసులు సిఐ పులి రమేష్, ఎస్సై లు ఎం రాజు, దివ్య, ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు పెంచికల జెపాల్, గీకురు ఐలయ్య, మాడుగుల యాదగిరి, కొదురుపాక శ్రీనివాస్, తదితరులు ఉన్నారు...

⬇ DOWNLOAD
×

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. …..

ఫైరింగ్ సాంప్రదాయాన్నిపై ప్రభుత్వంతో చర్చ…

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములకనూరు సమ్మక్క–సారలమ్మ జాతరను స్థానిక నాయకులు, భక్తులు ఐక్యంగా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. జాతర సమయంలో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చే వేళ ఫైరింగ్ సంప్రదాయం గతంలో కొనసాగిందని, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు డీజీపీ, సీపీతో చర్చించి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించిందన్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవార్లకు స్వాగతంగా ఫైరింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సంప్రదాయమని, గత 44 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ప్రభుత్వం గౌరవం ఇచ్చిందన్నారు. లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు..ప్రాంతంలో సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులు, అంజి వర్గాల ప్రజలపై అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు కింది స్థాయి ప్రజల వరకు నిరాటంకంగా చేరాలని అమ్మవార్లను వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈకార్యక్రమంలో ముల్కనూరు గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య, ఉపసర్పంచ్ కాసగోని మమత బాలకృష్ణ, జంగం పూర్ణచందర్, పొన్నం సత్యం, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, జక్కుల మల్లికార్జున, జక్కుల అనిల్, పోగుల శ్రీకాంత్, పోలీసులు సిఐ పులి రమేష్, ఎస్సై లు ఎం రాజు, దివ్య, ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు పెంచికల జెపాల్, గీకురు ఐలయ్య, మాడుగుల యాదగిరి, కొదురుపాక శ్రీనివాస్, తదితరులు ఉన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్