నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన సిపి.
ప్రజా గొంతుక చేర్యాల: మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెర్మల్ హెచ్చరించారు. మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగింది. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మున్సిపల్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టారు.సీపీ సాధన రష్మీ పెర్మల్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసీపీ సదానందం నేతృత్వంలో చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను సజావుగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.












