బర్ల కాపరి మృతి చందాలు వేసుకుని దహన సంస్కారాలు చేసిన గ్రామస్తులు.
ప్రజా గొంతుక (జనవరి 28) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని ఇదులపూర్ గ్రామంలో ఒంటరైన ఆడపిల్లలు, గతంలోతల్లి, ఇప్పుడు తండ్రి మృతి,చందాలు వేసుకొని, దహన సంస్కరాలు చేసిన గ్రామస్తులు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఇదులాపూర్ గ్రామానికి చెందిన బర్ల కాపరి సధయ్య, భార్య శ్యామల గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది, వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం కాగా, కుటుంబ పోషణ గడవడం కోసం సదయ్య ఇదులాపూర్ గ్రామంలో బర్ల కాపరిగా జీవనం సాగిస్తుండేవాడు, అదే క్రమంలో అతనికి అనారోగ్యం పాలవడంతో, ఎన్నో హాస్పటల్ చుట్టూ తిరిగిన, ఆరోగ్యం బాగుపడకపోగా,మరింత అనారోగ్యం క్షీణించి, బుధవారం రోజున అక్కల సదయ్య మృతి చెందాడు. గతంలో తల్లి, ఇప్పుడు తండ్రి మృతి చెందడం తో ఆడపిల్లలు అనాధలు అయ్యారు. తండ్రి దహన సంవత్సరాల కొరకు పిల్లల దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో, గ్రామస్తులు మానవ దృక్పథంతో, తలో కొంత చందాలు వేసుకొని, మృతుని దహన సంస్కరాలు నిర్వహించారు. నిరుపేద కుటుంబమైన సదయ్య పిల్లలు అనాధలు కావడంతో, గ్రామస్తులు ఎవరైనా దాతలు ఉంటే వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు.













