*-అంగన్వాడీ టీచర్ లు అయాలకురిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి.*
*-సిఐటియు అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసి రిటైర్మెంట్ అయిన అంగ న్వాడీ టీచర్లుకు.*
*- జోగులాంబ గద్వాల జిల్లా జనవరి 28*
అంగన్వాడి కేంద్రాలలో పనిచేసిన రిక్రూమెంట్ అయిన అంగన్వాడీ హెల్పర్స్ కు రిటైర్మెం ట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ,వీ.వీ నరసింహ డిమాం డ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయంలో ఏమోభూపాల్కివినతిపత్రంఅందించారు. సందర్భంగా వారు మాట్లాడు తూ..ద శాబ్దాల తరబడి గ్రామీణ, పట్టణ ప్రాంతా ల ప్రజలకు సేవలు అందించి రిటైర్మెంట్ అయిన అంగ న్వాడీలు, ఆయాలు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత సంవత్సరం జీవో నెంబర్ 8 జారీ చేసి రిటైర్మెంట్ అయిన ఆయాలకు లక్ష, టీచర్లకు రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ జీవో జారీ చేసి ఇప్పటివరకు అమలు చేయ లేదన్నా రు.ఇప్పటికే కొంతమంది అంగన్వాడీలు, ఆయాలు రిటైర్మెం ట్ బెనిఫిట్స్ నోచుకోక మరణించా రని ఆవేదన వ్యక్తం చేశా రు.పని చేసినన్ని రోజులు ఐసిడిఎస్ కు సంబంధం లేని అనేక రకాల పనులను టీచర్లు ఆయాలతో చేయించి శారీర క,మానసిక ఒత్తిడులకు గురి చేశారని, అటువంటి అనారోగ్యాల పాలైన మహి ళల గురించి ప్రభుత్వం బాధ్యతారా హిత్యంగా వ్యవహ రించడం సరైనది కాదన్నారు. 2022లోనే అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని అత్యున్నత న్యాయస్థా నాలు సూచించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఐసిడిఎస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి గర్భిణీలు బాలింతలకు సేవలు అందించిన అంగన్వాడీలు ఆయా లను ప్రభుత్వం విస్మరిం చడం బాధాకరమన్నారు. తక్షణమే టీచర్ కు 2 లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మరణించిన టీచర్లు ఆయాల స్థానంలో వారి వారసు లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ నాయకులు శాంతమ్మ శివమ్మ సువర్తమ్మ మారెమ్మ పాల్గొన్నారు.ధన్యవాదాలతో ఏమేలమ్మ తెలం గాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ అనుబంధంగద్వాల జిల్లా కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.












