సమ్మక్క–సారలమ్మ జాతర శుభాకాంక్షలు.
ప్రజా గొంతుక కొమురవెల్లి: మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ప్రతీకలుగా నిలిచిన ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మలు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలుగావెలుగొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన పోరాట గాథకుసమ్మక్క–సారలమ్మలు ప్రతీకలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే మహోన్నత పర్వదినమే మేడారం జాతర అని ఆయన అన్నారు. కొంగుబంగారంలా కొలువైన తమ ఇల వేల్పులకు మొక్కులు చెల్లించేందుకు, కోరిన కోరికలు తీర్చాలని ఆకాంక్షిస్తూ దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచికూడా భక్తులు తరలివచ్చే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం మేడారం జాతర అని అన్నారు. కోట్లాదిగా భక్తులు పాల్గొనే ఈ జాతర కుంభమేళాను తలపించే విధంగా విశాలత, వైభవంతో కొనసాగుతుండటం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు.సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈమహాజాతరశాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సాగాలన్నారు.












