E-PAPER

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్.

Date : 28 January 2026, 6:24 pm Posted By : PRAJA GONTHUKA

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్.

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్.

ప్రజా గొంతుక చేర్యాల: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 ప్రక్రియలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ కె. హైమావతి పరిశీలించారు. మున్సిపాలిటీ నామినేషన్ ప్రక్రియను జిల్లా మునిసిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం, ఐఏఎస్ క్షేత్రస్థాయిలోపరిశీలించారు.నిబంధనల ప్రకారం నామినేషన్ లు స్వీకరిస్తున్నామని సిబ్బంది తెలపగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉన్నాయా, హెల్ప్ డెస్క్ మరియు ఆయా రిటర్నింగ్ అధికారుల పనితీరును పరిశీలించారు.జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పిర్యాదులు చేయాలన్న 9014192463 ఫోన్ నంబర్ సంప్రదించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు తెలిపారు.జిల్లా క్షేత్రస్థాయిలోపరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.నేటి నుండి 3 రోజుల పాటు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ సెంటర్ లో నామినేషన్ స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11 వ తేదీన పోలింగ్, 13 వ తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం సెంటర్ చుట్టు 100 మీటర్లలో 144 సెక్షన్ అమలుతో పాటు నామిని అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి పంపించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. నామిని అభ్యర్థి సెంటర్ కి వచ్చిన సమయం నుండి నామినేషన్ వేసి బయటికి వెళ్ళే సమయాన్ని నోట్ చేసుకుని మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నామినేషన్ సెంటర్ లో ఫోన్ అనుమతి లేదని అన్ని సెంటర్లలో 100 శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్