E-PAPER

*ఉపాధ్యాయ ఉద్యోగుల పి.ఆర్.సి ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్!! “డి.టి.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బాకీ చంద్రబాను”.* 

Date : 28 January 2026, 4:59 pm Posted By : PRAJA GONTHUKA

*ఉపాధ్యాయ ఉద్యోగుల పి.ఆర్.సి ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్!! “డి.టి.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బాకీ చంద్రబాను”.* 

*ఉపాధ్యాయ ఉద్యోగుల పి.ఆర్.సి ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్!! "డి.టి.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బాకీ చంద్రబాను".*

(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)జనవరి28::మద్దూరు(దూల్మిట్ట)

ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇవ్వవలసిన పి ఆర్ సి రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని మరియు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, మద్దూరు మండల కేంద్రంలో బుధవారం రోజున నిర్వహించిన డెమొక్రటిక్ ఫెడరేషన్ మండల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాకీ చంద్రబాను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పే రివిజన్ కమిషన్ కమిటీ రిపోర్టును తెప్పించుకోకుండా మూడుసార్లు వాయిదాలు వేసుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందున అలా కాలయాపన చేయకుండా శివ శంకర్ రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ యొక్క పిఆర్సి రిపోర్టును వెంటనే తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సిని విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా మూడు సంవత్సరాలు పి.ఆర్.సి ని ఆలస్యంగా ప్రకటించి ఉద్యోగులకు రావలసిన ఆర్థిక లాభాలను కొల్లగొట్టిందని తెలిపారు. కావున గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత ప్రభుత్వమైన వెంటనే పిఆర్సి రిపోర్టును తెప్పించుకొని అమలు చేయాలని కోరారు. పెండింగులో ఉన్న డిఏ లను కూడా ఇవ్వాలని మరియు పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటిని ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు నరసింహులు, మల్లేశం, సంపత్ కుమార్, రఫత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :