నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్: జనవరి:28
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన,రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్ ఓ ఎస్ అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా సబ్ కలెక్టర్ వెంట మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ తహసీల్దార్,మిర్యాలగూడ ఒకటవ పట్టణ సీఐ, రెండవ పట్టణ సిఐ పాల్గొనడం జరిగింది.












