సీతారామస్వామి ఆలయ విషయంలో రెండు గ్రామాల మద్య వివాదం
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మారుమూల గ్రామాలు అయిన తాట్లవాయ మరియు ధర్మాజీపేట గ్రామాల మధ్య తాట్లవాయ రామస్వామిగా పిలవబడే రాముల వారి ఆలయం విషయంలో ఇరు గ్రామాల మధ్య వివాదంగా మారింది
మంగళవారం రోజు రెండు గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచులు ప్రజలతో వచ్చి రాయికల్ తాహసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించి ఫిర్యాదు చేయడం జరిగింది. తాట్లవాయ గ్రామ ప్రజలు విన్నపం ఏమనగా, రాములవారి గుడి మా ఊరి ఆవరణలో ఉండి ప్రతి సంవత్సరము ఆలయ అభివృద్ధి మరియు జాతర కొరకు అయ్యే ఖర్చులన్నీ గ్రామపంచాయతీ నుండి ఖర్చు చేయడం జరుగుతుందని కానీ, ఇప్పుడు ధర్మాజీపేట గ్రామ ప్రజలు వచ్చి ఆ గుడిలో మాకు కూడా పొత్తు ఉందని ఊరిలోకి వాదనకు వచ్చారు. దీని గురించి ఎమ్మార్వో కి సమస్య వివరించి పిర్యాదు చేయడం జరిగింది.
అదేవిధంగా ధర్మాజీపేట గ్రామ సర్పంచ్ ప్రజల విన్నవించే విషయమేమనగా రాముల వారి గుడి గత 70 సంవత్సరాల నుండి రెండు ఊర్లము కలిపి జాతర ఉత్సవాలు, జరుపుకుంటున్నాము అలాగే రాములవారి పేరుమీద మా ఊరిలో దేవాలయ భూమి ఐదు ఎకరాలు ఇప్పటికే సాగులో ఉన్నది కానీ తాట్లవాయ గ్రామంలోని ఆలయ పరిసర ప్రాంతాలలో దేవాలయ భూమి అంతా కూడా ఆక్రమణకు గురైనది కావున అట్టి భూమిని గుర్తించి దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తెచ్చి ఆలయ భూములను కాపాడాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది . అధికారులు ఈ విషయంలో స్పందించి న్యాయం చేయాలని ఇరు గ్రామ ప్రజలు కోరుచున్నారు.












