ఉపాధ్యాయున్ని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అభయ్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన్ పెల్లి ఆనంద్ రావు, యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు పొన్నం రమేష్, రాయికల్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంతడుపుల గంగరాజం, రాపర్తి నరసయ్య, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ లు పాల్గొన్నారు.












