ప్రకృతి వైద్యం సహకారంతో శరీరంలోనిదీర్ఘకాలికవ్యాధులనునివారించుకోవచ్చు
*-ప్రకృతి వైద్యం సహకారంతో శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకో వచ్చని*
*-గద్వాల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర అన్నారు*
తెలంగాణ ప్రభుత్వ యోగాధ్యా యన పరిషత్ మరియు ఆయుష్ శాఖ కొణిజేటి రోశయ్య నేచర్ క్యూ ర్ హాస్పటల్ వారి సహాకారంతో మంగళవారం జిల్లా ఆసుపత్రిలో ఆయుష్ ప్రకృతి శిభిరం లో నాచ్యు రోపతి వైద్యం మరియు యోగా శిబిరం నిర్వహించారు.ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన శిబిరంలో రోగులకు అక్యుపంచర్, ఫిజియో థెరపీ, డైట్ కౌన్సెలింగ్, యోగా పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాధవి లత మాట్లాడుతూ మన రోజు వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో, జీవన శైలి పద్దతుల మరియు ప్రకృతి చికిత్సలో ఇవ్వబడే మట్టి చికిత్స, జలవైద్యం, థెర్పెటిక్ యోగా, ఆక్యుపంచర్, ఉపయోగాలు గురించి తలిపారు. డాక్టర్ బాలకొండయ్య మాట్లా డుతూ నేచురల్ జీర్ణశక్తిని, రోగనిరోదక శక్తిని పెంపొందించుకోవచ్చు అని చెప్పారు. శిబిరంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. దీర్ఘకాలిక ఈ కీళ్ల నొప్పులు, జీర్ణాశయ సమస్యలు, మెడ మరియూ నడుము నొప్పుల చికిత్స అందించారు. అవగాహన కల్పించేందుకు రాగి, నువ్వుల లడ్డూలు, జొన్నలు, సజ్బలు, రాగులు, కొర్రలు మొదలగు సిరిదాన్యాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య హాస్పటల్ వైద్యులు డాక్టర్ మధవీలత, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా, ఆర్ఎంఓ డాక్టర్ బాలకొండయ్య, ఆయుష్ మందిర్ డాక్టర్ సులేఖ, జూనియర్ డాక్టర్లు వైష్ణవి, ప్రణీత,నిర్చిత రెడ్డి, భావన, అమిత,ఆదర్ష్, రుత్విక, హారిక పాల్గొన్నారు.













