చిన్న మేడారం మహా జాతరకు ఎమ్మెల్యే కు ఆహ్వానం....
మన్సాన్పల్లి గుట్టమీద కొలువైన సమ్మక్క సారలమ్మ...
గ్రామంలో ఏండ్లుగా పూజలు అందుకుంటున్న తల్లులు....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,మన్సాన్పల్లి గ్రామంలోఎన్నో ఏండ్లుగా కొలువైన సమ్మక్క సారలమ్మ మహా జాతర కు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి గ్రామ బిఆర్ఎస్ నాయకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారినిశాలువలతో సన్మానించారు. అమ్మవారి దర్శనానికి ఎమ్మెల్యేను రావలసిందిగా గ్రామస్తులు కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 29 తారీకు నాడు అమ్మవారి దర్శనానికి వస్తానని, దర్శనానికి వచ్చిన ప్రజలకు ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని, అమ్మవారి కృపతో అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.కమిటీ సభ్యులు మరియు BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శాకంపల్లి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ పంజాల శ్రీధర్,ఉప సర్పంచ్ పండుగ శ్రీకాంత్,సీనియర్ నాయకులు గీస ప్రకాశం,కోటూరి రాజు,సూరంపల్లి శ్రీనివాస్,చొక్కం లింగం, తుప్పుడు కిషన్ పాల్గొన్నారు












