E-PAPER

అంబేద్కర్ త్యాగ ఫలితమే ఈ రాజ్యాంగం

Date : 27 January 2026, 9:53 am Posted By : PRAJA GONTHUKA

అంబేద్కర్ త్యాగ ఫలితమే ఈ రాజ్యాంగం

అంబేద్కర్ త్యాగ ఫలితమే ఈ రాజ్యాంగం

*మండల దళిత సంఘం అధ్యక్షులు కర్రె భరత్ కుమార్.*

కుల్కచర్ల,ప్రజా గొంతుక (ఘంటసాల పెంటయ్య): వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం పెద్దగెట్ అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో మండల దళిత సంఘం అధ్యక్షులు కర్రె భరత్ కుమార్,ప్రధాన కార్యదర్శి గుండుమల్ల పెద్ద నర్సిములు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను సంఘం ముఖ్య నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే మనకు 1947 న స్వాతంత్య్రం లభించిందని అన్నారు.పరిపాలనలో భాగంగా రాజ్యాంగం జనవరి 26/1950 లో అమలులోకి రావడం ఈ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగం రచనకు అంబేద్కర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.ఆయన త్యాగ ఫలితంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.నేటి సమాజంలో ఉన్న యువత ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు.యువత ఎప్పుడు మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా,మండల దళిత సంఘం ముఖ్య నాయకులు,స్థానిక సర్పంచ్,ఉపసర్పంచ్,రాజకీయ పార్టీలకు అతీతంగా ముఖ్య నాయకులు,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్