ఉత్తమ సేవకు తగిన గౌరవం..
*జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి.*
కుల్కచర్ల,ప్రజా గొంతుక (ఘంటసాల పెంటయ్య): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉధ్యాయులు వాడిత్య గోపాల్ కు గిరిజన అభివృద్ధి శాఖ తరపున ఉత్తమ సేవలకు తగిన గౌరవం రావడం అభినందనీయమని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి అన్నారు.77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఉన్నతంగా పనిచేసే ఉత్తమ సేవలను పొందాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత గోపాల్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వడం గర్వంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు.












