మహిళలకు చీరలు అందచేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని నక్కవానిగూడెం సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్ ఉన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా నక్కవానిగూడెం గ్రామంలో సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని రంగు రంగుల రంగవల్లులను ముగ్గులు అందంగా తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికి గణతంత్ర దినోత్సవం సందర్భంగాగిఫ్టు అందిస్తూ గెలిచిన విజేతలకు సర్పంచ్ పట్టు చీరలను బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపు ఓటంలో సహజమని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి వార్డ్ మెంబెర్స్ గోదాల నాగమణి,బోడపట్ల రమేష్ ,జక్కుల జ్యోతి,బొట్టు సుధాకర్,అధ్యక్షులు కట్టెల స్వామి, బొమ్మిడి దయాకర్ రెడ్డి, యం.జంపయ్య కొయ్యడి భాస్కర్, నాయకులు ఐలయ్య ,రమేష్ ,రవి, నర్సింహాలు, లింగస్వామి, రాజిరెడ్డి, గుంటిపల్లి సాగర్, మాజీ సర్పంచ్ గోదాల యాదగిరి పాల్గొన్నారు.












