త్రివేణిలో కన్నుల పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రజా గొంతుక ప్రతినిధి/ ఖమ్మం
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివేణి పాఠశాలలో నిర్వహించిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కార్డియాలజీ విభాగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ పి.హర్షతేజ, మరియూ, విశిష్ట అతిథిగా ఇండియన్ ఆర్మీలో, జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్లో నాయక్ గా 17 సంవత్సరాలు సేవలందించిన శ్రీ జి వెంకటరామిరెడ్డి గారు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ముఖ్యఅతిథి, విశిష్ట అతిధుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.ముఖ్య అతిథి హర్ష తేజ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు విద్యార్థిని విద్యార్థులు తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక మీదుగా విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని అలాగే దేశ రక్షణలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ త్రివేణి విద్యాసంస్థలు విద్యార్థుల దేశభక్తి ని పెంపొందిస్తూ,వారి ఎదుగుదలకు ఎల్లప్పుడూ కంకణ ధారణ చేసి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తాయని వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 76 సంవత్సరాల గణతంత్ర భారతదేశం ఎన్నో మైలురాళ్లను చేరుకొని అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అలాగే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా, ఆర్థిక సామాజిక రక్షణ వ్యవస్థలుగా రూపొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు విద్యార్థులు గానం చేసిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పాఠశాలలోని ఎన్ సి సి విద్యార్థులు నిర్వహించిన పిరమిడ్ షో విద్యార్థుల టీం వర్క్ క్రమశిక్షణ లను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి.ఈ కార్యక్రమంలో కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు పాఠశాల సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న, ముస్తఫా , క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












