క్రీడలతో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు...
విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్ ఇజ్జగిరి రాములు..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గ్రామస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి, మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయించి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దాతలు రాపెల్లి ఆంజనేయులు, నర్సిరెడ్డి సహకారంతో బహుమతులను బండ నాగారం సర్పంచ్ ఇజ్జగిరి రాములు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రక్కదారి పట్టకుండా క్రీడలలో రాణించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, గ్రామానికి పేరు తీసుకురావాలని, క్రీడలలో రాణించడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని, క్రీడలో ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు. క్రీడాకారులకు విద్యార్థులకు సహాయం అందించడానికి ఎల్లప్పుడు ముందు ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీధర్ రెడ్డి ఉపసర్పంచ్ మానేపల్లి మల్లయ్య ,వార్డు మెంబర్లు చల్ల సురేందర్ రెడ్డి, ఆరేళ్ల భాస్కర్, హెచ్ఎం హేమరాణి నాయకులు ఏళ్ల చంద్ర రెడ్డి, జంగిలి సామి, చల్ల సుధాకర్ రెడ్డి, ఇజ్జగిరి నరేష్, ఇజ్జగిరికర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.












