77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిఎసిఎస్‌లో జెండా ఆవిష్కరణ
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్చన్నపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను పిఎసిఎస్ అసిస్టెంట్ రిజిస్టర్ కర్నియల్ ఎస్. ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమయానికి నాణ్యమైన ఫర్టిలైజర్లు అందజేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పిఎసిఎస్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్ల కొనుగోలు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ బాలస్వామి, గోపాల్ నగర్ సర్పంచ్ పేరా బోయిన కళ్యాణి పరుశరాములు, ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్ మరియు వార్డ్ నెంబర్లు, రైతులు పాల్గొన్నారు












