గెలుపు ఓటముల కన్నా క్రీడా స్ఫూర్తి ముఖ్యం...
ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం..
బహుమతులు అందజేసిన గంగం సతీష్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట : మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్ లు ఏర్పాటుచేసిన ఆట పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి,రైతు సమన్వ సమితి మాజీ అధ్యక్షుడు చల్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి గ్రామ ప్రజలతోపాటు పెద్దలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా గ్రామంలో ప్రజలు ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారని, తమ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేసి అక్షరాస్యతలో మండలంలో మొదటి స్థానంలో ఉండాలని కోరారు. గ్రామంలో ఎలాంటి సహాయం చేయడానికి ముందు ఉంటానని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ,మాజీ సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












