పార్థివ దేహాన్ని సందర్శించి 5000 ఆర్థిక సహాయం చేసిన నిడమనూరు సర్పంచ్..... శేషరాజు సంధ్య శ్రీనివాస్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:25
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు గుండు రాజు మరణించారని తెలుసుకున్న నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు












