సమాజంలోని అంశాల పై...విద్యార్థులకు పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించాలి....
తాసిల్దార్ జగదీశ్వర్ రావు.
ప్రజా గొంతుక( జనవరి 25) కాల్వ శ్రీరాంపూర్ : క్విజ్ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వేలుగు లోకి వస్తుందని తాసిల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలోనీ ఎంపిక చేసిన విద్యార్థులతో, మండల స్థాయిలో ఐదుగురు టీం సభ్యులతో కూడిన, విద్యార్థుల తో క్విజ్ పోటీలలో నిర్వహించరు. ఈ పోటీలలో విద్యార్థులను ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందించిన విషయ పరిజ్ఞానం అందుకుని క్విజ్ పోటీలలో పాల్గొంటే,పోటీ తత్వం తో పాటు ప్రతిభ పాఠవాలు తెలుస్తాయని అన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజంలో అన్ని అంశాల పై కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాఅధికారి సిరిమల్ల మహేష్,డిప్యూటీ తాసిల్దార్ శంకర్ గౌడ్,మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, ఆర్ ఐ ఆలీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













