దేవరకొండలో కార్మిక నాయకుడు స్వర్గీయ హనుమంతు చంద్రన్న 21 వ వర్ధంతి. చంద్రన్న ఫౌండేషన్
*ప్రజా గొంతుక జనవరి 23 డివిజన్ రిపోర్టర్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
తేదీ 24. 01.2026 శనివారం రోజున దేవరకొండలో
చంద్రన్న 21వ వర్ధంతి. దివంగత నా కార్మిక నాయకుడు. ప్రజల మనిషి దేవరకొండ మాజీ సర్పంచ్ స్వర్గీయ డ్రైవర్ చంద్రన్న 21వ వర్ధంతి కార్యక్రమాన్ని దేవరకొండ పట్టణ నడిబొడ్డున గల చంద్రన్న కాంస్య విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించిన అనంతరం స్థానిక కోదండ రామాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు ఈ సంవత్సరం నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రన్న గోల్డ్ మెడల్ రూ" 50000/-దేవరకొండ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యాభ్యాసించి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం మరియు చంద్రన్న గోల్డ్ మెడల్ బహుకరించడం జరుగుతుంది. కావున చంద్రన్న అభిమానులు. శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ పాల్గొనవలసిందిగా చంద్రన్న కుమారులు హనుమంతు వెంకటేష్ గౌడ్. హనుమంతు శ్రీనివాస్ గౌడ్. హనుమంతు రాఘవేందర్ గౌడ్. ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. చంద్రన్న పౌండేషన్ దేవరకొండ












