ప్రజల సమస్యలకు వేగవంతంగా పరిష్కారాలు అమలు చేయండి : నెమలి అనిల్ కుమార్
ఉప్పల్ ప్రజా గొంతుక ప్రతినిధి హైదరాబాద్
మల్లాపూర్ వార్డు కార్యాలయంలో నాచారం సర్కిల్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈ ఈ) శ్రీ రమేష్ ని, డిప్యూటీ ఇంజనీర్ (డి ఈ) శ్రీమతి మహేశ్వరిని నెమలి అనిల్ కుమార్ కలుసుకొని, మల్లాపూర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు అలాగే నూతన డివిజన్ సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా పరిష్కారాలు అమలు చేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పనులు సమయపాలనతో పూర్తి చేయాలని ,ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నెమలి అనిల్ సూచించారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు దంతూరి రాజు గౌడ్, బాల్రాజ్ గౌడ్, కోయలకొండ రాజేష్, కప్పర సాయి, దాసరి సాయి, కాప్రా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.












