ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనగల్లు మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివ లీల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరంలో అగ్రగణ్యుడైన సాయుధ పోరాట యోధుడు. "జై హింద్", "చలో డిల్లీ" నినాదాలతో దేశభక్తిని రగిల్చిన నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐ ఎన్ ఏ) స్థాపించి, జపాన్ సహాయంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.ఈ కార్యక్రమంలో పోతులపాటి నాగమణి, సూరిగల మమత చిన్నారులు పాల్గొన్నారు..












