E-PAPER

ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగాల భాస్కర్ రెడ్డి..

Date : 23 January 2026, 6:58 pm Posted By : PRAJA GONTHUKA

ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగాల భాస్కర్ రెడ్డి..

ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగాల భాస్కర్ రెడ్డి..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23

తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవాని కుంట గ్రామ ఉపసర్పంచు వంగాల భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లావుడ్య రాములు నాయక్ శుక్రవారం హైదరాబాద్ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ ఉపసర్పంచుల సంఘం చైతన్యానికి, అభివృద్ధికి వ్యక్తిగత వివాదాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారు సంఘం బలోపేతానికి నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల అనుముల మండల, నల్లగొండ జిల్లా ఉపసర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర జడ్పీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థి రమావత్ దినేష్ నాయక్, కంచర్ల రంజిత్ రెడ్డి, గగ్గినపల్లి విద్యాసాగర్ రెడ్డి, కట్టెబోయిన కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :