టైమ్ స్కూల్‌లో ఘనంగా వసంత పంచమి వేడుకలు & అక్షరాభ్యాస కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా టైమ్ స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జ్ఞానదేవత శ్రీ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థుల్లో విద్యపట్ల ఆసక్తి, భారతీయ సంస్కృతి–సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వసంత పంచమి శుభదినాన్ని పురస్కరించుకొని అక్షరాభ్యాస విద్యా కార్యక్రమంను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 155 మంది చిన్నారులు అక్షరాభ్యాసం కోసం హాజరై అడ్మిషన్లు పొందడం విశేషంగా నిలిచింది. ఇది టైమ్ స్కూల్‌పై తల్లిదండ్రుల విశ్వాసానికి నిదర్శనంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ వేడుకలు పాఠశాల డైరెక్టర్లు మందా నరేందర్ రెడ్డి, కత్తి కోటి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ, వసంత పంచమి విద్యారంభానికి అత్యంత శుభదినమని, అక్షరాభ్యాసం ప్రతి విద్యార్థి జీవితంలో తొలి ముఖ్యమైన అడుగని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సరస్వతి పూజలు, అక్షరాభ్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పాఠశాల ప్రాంగణం పసుపు రంగు అలంకరణలు, పూలతో ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో విద్య విలువలు, సంస్కృతి పట్ల గౌరవం మరింత పెరిగిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. చివరగా డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ పాల్గొన్నవారికి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు.












