• గొల్లపల్లిలో మాభూమి రథయాత్ర హోరు..
*• లక్ష కిలోమీటర్ల యాత్ర...రాజ్యాధికారం దిశగా అడుగులు.*
*- డా.విశారదన్ మహరాజ్...*
జగిత్యాల జిల్లా జనవరి 23 ప్రజా గొంతుక న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్డి వెలుమల ఆదిపత్య పాలనను కూల్చివేసి బహుజన రాజ్యాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ స్పష్టం చేశారు.
ఆయన చేపట్టిన లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర గొల్లపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కార్నర్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.రాష్ట్రంలో నూటికి తొంబై శాతంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నేటికి రాజకీయంగా ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన పోరాటం అగ్గి రవ్వల రగులుతోందని, అణగారిన పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కేవరకు ఈ జేఏసీ పోరాటం విశ్రమించదని హెచ్చరించారు.బహుజనులు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, అధ్యక్షులు మానాల కిషన్, జిల్లా ఇంచార్జ్ దువ్వాక శివ, మండల బాధ్యులు అశోక్, ఉప సర్పంచ్ గురజాల బుచ్చన్న, శ్రీకాంత్ చారి,చెట్పల్లి తిరుపతి, సాతల లక్ష్మణ్, చెవులమద్ది హనుమండ్లు, గంగాధర మధుసూదన్, నల్ల శ్యామ్, ఎలగందుల తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












