నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన పోతుల రాములు యాదవ్....
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,పోచన్నపేట గ్రామంలో ఎన్నో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించి ఆర్థిక భరోసా కల్పించిన సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోతుల రాములు యాదవ్ మరొక కుటుంబానికి అండగా నిలిచారు.పోచన్నపేట గ్రామంలో మెకానిక్ సత్తయ్య భార్య వలబోజి రాజ్యలక్ష్మి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి, నేనున్నానని భరోసా నీ ఇచ్చి, వారి కుమరుడు ఆంజనేయులుకి సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ వారికి ఆర్థిక 5000రూపాయలు అందించారు. ఈ సందర్భంగా గంధాల సిద్ధులు, డాక్టర్ భాస్కర్ సాంబయ్య, జనార్ధన్ సిద్ధులు, రామచంద్రం, సిద్ధి మల్లయ్య, వారి వెంట తదితరులు ఉన్నారు.












