కిడ్నీ వ్యాధితో పోరాడుతున్న మహిళకువిబిఎన్ ఫౌండేషన్ మానవతా చేయూత......
మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న విబిఎన్ ఫౌండేషన్ సేవలు...
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:23
అవసర సమయంలో ఆదుకున్న దాసరి నినన్ సేవాభావం...
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు చెందిన పి. రమేష్ సతీమణి పి. రాజేశ్వరి ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న వి బి ఎన్ ఫౌండేషన్ సర్వీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దాసరి నినన్ గురువారం ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.అవసర సమయంలో చేయూత అందించడం సమాజ బాధ్యత అని ఈ సందర్భంగా దాసరి నినన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్క నిర్మల , వల్లెపు నాగార్జున మర్రి నరేందర్ పాల్గొని బాధిత కుటుంబానికి తమ మద్దతు తెలిపారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.












