దేవరకొండ నూతన ముఫ్తి గా సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి ఎంపిక
*ప్రజా గొంతుక జనవరి 22 డివిజన్ ప్రతినిధి శిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ నియోజకవర్గ ముస్లిం మత పెద్ద , నూతన ముఫ్తి ఖాతీబ్ - ఏ - ఈదెన్ ,ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి నీ దేవరకొండ ఈద్గా కమిటీ ఎంపిక చేసింది.
ఈ నెల 18 న స్థానిక మక్కా మస్జీద్ లో జరిగిన ఈద్గా కమిటీ సమావేశంలో ప్రజల అభిష్టం మేరకు ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి పేరును ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీమోద్దీన్ ప్రతిపాదించారు. దింతో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం పలికారు. ప్రజల అభిష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు స్వర్గస్తులైన దేవరకొండ ముఫ్తి హాజ్రత్ మహ్మద్ జావీద్ హుస్సేన్ ఖాస్మి రహ్మతుల్లా అలైహి యొక్క పూర్తి బాధ్యతలు, సేవలు ఇక నుండి ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్, బక్రీద్ వేళా ఈద్గా లో జరిగే ప్రత్యేక ప్రార్ధనలకు నూతన ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి సారథ్యం వహిస్తారన్నారనీ తెలిపారు. అనంతరం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి నీ ఈద్గా కమిటీ సభ్యులు సన్మానించారు. సందర్బంగా పలువురు పూలమాలతో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రహత్ అలీ, గౌరవ అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, జావీద్ అలీ, జనరల్ సెక్రటరీ యండి ఇలియాస్ పటేల్, ఉపాధ్యక్షులు జాఫర్ ఖాన్, యండి షబ్బీర్, సెక్రటరీ ఇలియాస్ బాబా, జాయింట్ సెక్రటరీలు ఖైసర్, అఫ్రోజ్, సహాయ కార్యదర్శులు ముజీబ్, సయ్యద్ అజీజ్, సభ్యులు ఖుద్రతుల్లాహ్, సయ్యద్ దస్తగిర్, యండి సలీమ్, హమీద్, షకీల్, ఖాజ, షఫి, మంజూర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.












