పత్రిక రంగంలో శివప్రసాద్ లోటు తీర్చలేనిది..ఎంపీడీవో
ప్రజా గొంతుక జనవరి ప్రజా గొంతుక (జనవరి 23 )కాల్వ శ్రీరాంపూర్ మండలం సీనియర్ పాత్రికేయులు, సూర్య రిపోర్టర్ దివంగత బాలే శివప్రసాద్ గుండెపోటుతో మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించిన ఎంపీడీవో రామ్మోహన్ చారి.. శివప్రసాద్ చాలా మృదు స్వభావి అని, సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యల పరిష్కారానికి కృషిచేవాడని ఎంపీడీవో అన్నారు. వారి వెంట ఆయా పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.













