కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణి.
ప్రజా గొంతుక (జనవరి 22 )కాల్వ శ్రీరాంపూర్ :గౌడ కార్మికుల ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి కాటమయ్య కిట్టు రక్షకవచం పనిచేస్తుందని మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి,మాజీ ఎంపీపీసారయ్య గౌడ్ లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రామాణ రావు ఆదేశాల తో గీత కార్మికులకు సహాయం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. కాటమయ్య రక్షణ కవచం కిట్టు గౌడ్ అన్నల ప్రాణాలు పోకుండా సహాయపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ చిరంజీవి, ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శంకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేణ సదయ్య,సర్పంచ్ అరెల్లి రమేష్, మొండయ్య, ఆయా గ్రామాల గౌడ సోదరులు, కాటమయ్య కౌశల్ ట్రైనర్స్ ,తదితరులు ఉన్నారు.












