చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం.
ప్రజా గొంతుక( జనవరి 21 )కాల్వ శ్రీరాంపూర్ : చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతులకు నీరు అందివాలని ఉద్దేశంతో, ఎస్సారెస్పీ కాలువలోని పూడికతీత పనులు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఇధులాపూర్ గ్రామానికి వెళ్లే ఎస్సారెస్పీ కాలువ 22 ఆర్, సంబంధించిన చివరి ఆయకట్టుకు వరకు నీరు అందించాలని ఉద్దేశంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహాయ సహకారాలతో, జెసిబి ని సమకూర్చడంతో ఎస్సారెస్పీ కాలువ లోని, ముళ్ళకంపలు తొలగింపు, బండరాళ్లు,పూడిక తీత పనులు చేయిస్తున్నట్లు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ తెలిపారు. వారితో పాటు ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఇదిలాపూర్ సర్పంచ్ లత అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, డైరెక్టర్ రవి, ఉప సర్పంచ్ నూనె హరీష్ వార్డ్ మెంబర్లు కూతురు కిరణ్ బండారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు












