E-PAPER

క్రమశిక్షణతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతాం

Date : 21 January 2026, 8:27 pm Posted By : PRAJA GONTHUKA

క్రమశిక్షణతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతాం

క్రమశిక్షణతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతాం

ప్రజాగొంతుక న్యూస్ మల్దకల్ జనవరి 21

ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ అలవర్చుకొని, ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు.

పిఎం శ్రీ స్కూల్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మల్దకల్ జడ్పిహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థినిలు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్ల్స్ చైల్డ్ ఇంట్రక్షన్ విత్ రోల్ మోడల్ గా జిల్లా కలెక్టర్ తో సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు కలెక్టర్ కావడానికి రోల్ మోడల్, ప్రిపరేషన్, తదితర అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ సంతోష్ స్పందిస్తూ తాను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే మైసూర్లో వివిధ సందర్భాల్లో జరిగిన కార్యక్రమాల్లో అప్పటి కలెక్టర్ పాల్గొనగా ఆయనకు అందరూ ఇస్తున్న గౌరవం, విలువ చూడడం జరిగిందని దాంతో సివిల్స్ సాధించే దిశగా సాధన మొదలుపెట్టానన్నారు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే కలెక్టర్ కావడం వలన ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఎక్కువ అవకాశం ఉందని పేర్కొన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, తదితర ఉద్యోగాలు చేసేవారు తమ పరిధిలో ఉద్యోగానికి న్యాయం చేస్తారని, జిల్లా కలెక్టర్ అన్ని శాఖల్లో సంబంధిత అధికారులు మెరుగైన పనితీరు కనబరిచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. తాను రెండుసార్లు సివిల్స్ సాధించడంలో విఫలమైనప్పటికీ తన తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతో మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఏ ఉద్యోగం సాధించాలన్న ఇప్పటినుంచే పత్రికలు చదువుతూ కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలని, అలాగే సంబంధిత ఉద్యోగానికి అవసరమైన సబ్జెక్టులపై పూర్తి అవగాహన అవసరమన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు టైం టేబుల్ ప్రకారం ఏకాగ్రతతో ఆయా సబ్జెక్టులు సాధన చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ముఖ్యమని, కొంత సమయాన్ని వారితో గడిపేందుకు కేటాయించాలన్నారు. తాను తరచూ పాఠశాలలు సందర్శించినప్పుడు విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకొని చదవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి సమాజంలో మంచి మార్పు రావడానికి తమ వంతుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, విద్యార్థినిలు కలెక్టర్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం సురేష్, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, నాగేశ్వరరావు, లోకేశ్వరి, సుజాత, పద్మ, మాధవి లత, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్