ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం హర్షం
*గ్రామ సర్పంచ్ తిరుపతయ్య ముదిరాజ్.
కుల్కచర్ల, ప్రజా గొంతుక న్యూస్: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రాంపూర్ గ్రామంలో 4 ఐమాక్స్ లైట్లు గ్రామ సర్పంచ్ చెక్కల తిరుపతయ్య ముదిరాజ్,మార్కెట్ చైర్మన్ చైర్మన్ బిఎస్. ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలోప్రారంభించినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రాత్రి సమయంలో ప్రయాణం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవతో మా గ్రామంలో 4 ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లక్ష్మయ్య,ఇప్పాయిపల్లి సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్,ఉప సర్పంచ్,మాజీ సర్పంచ్,మానెమ్మ,కృష్ణయ్య, సత్తయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు.












