ప్రతిమ యాజమాన్యం మధ్యతరగతి కుటుంబాలకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయం.
ప్రజా గొంతుక జనవరి 21 కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామం నుండి కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ యజమాన్యం వారు ప్రజల రాకపోకల కొరకు బస్సు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ మనోహర్ రావు తెలిపారు. సర్పంచ్, పాలకవర్గం సభ్యులు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య సమస్యల ఇబ్బందులు ఖరీదైనవి కనుక, ప్రతిమ హాస్పిటల్ యజమాన్యం సేవాభావంతో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా ఉచిత రాకపోకలకు బస్సు ఏర్పాటు,అలాగే ఉచిత కంటి వైద్యం, అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. వివిధ రకాల వైద్య ఆపరేషన్ లో భాగంగా 50% సబ్సిడీ సౌకర్యం తో వైద్యం సంబంధించిన ఆపరేషన్ లు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. వైద్యం కోసం బస్సులో వెళ్లేవారు తప్పకుండా రేషన్ కార్డు వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత సదయ్య, వార్డ్ సభ్యులు దొమ్మటి శంకరమ్మ, రాందేని రాజేశం, బెజ్జాల మమత, దొమ్మటి పోషాలు, గాజర్ల శారద, పోగుల రమేష్,అనుముల రమేష్, సముద్రాల వసంత, బెజ్జాల సంపత్, ఆలయ చైర్మన్ దోమ్మటి రవి, గ్రామ ప్రజలు కట్ల నరసయ్య,ఎండి అబ్దుల్లా,గాధర్ల శ్రీధర్, రాజకుమార్, ప్రతిమ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













