పెగడపల్లి సమ్మక్క సారాలమ్మ జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే.
ప్రజా గొంతుక (జనవరి 21) కాల్వ శ్రీరాంపూర్ :మండలంలోని పెగడపల్లి గ్రామంలో నిర్వహించే జాతర ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర రహదారులను కోట్ల రూపాయలు వెచ్చించి, రహదారులు నిర్మిస్తున్నామని, జాతర సమీపంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,జాతర ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు, వార్డ్ సభ్యులు తదితరులు ఉన్నారు.












