అక్రమ కేసులు ఎత్తివేయాలి - సిపిఎం డిమాండ్.
(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)జనవరి21::మద్దూరు(దూల్మిట్ట) ప్రజా సమస్యలు పరిష్కరించాలని పోరాడిన సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమకేసులకు నేడు చేర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ, మద్దూరు మండల కేంద్రం నుండి సలాకపూర్, నర్సాయిపల్లి, రేబర్తి నుండి వంగపల్లికి, రెబర్తి నుండి జెల్లగూడెంకు, మర్మముల నుండి లద్నూర్ వరకు బైరంపల్లి నుండి దూల్మిట్టకు, దూల్మిట్ట నుండి తోర్నాలకు గ్రామాల మధ్య బీటీ రోడ్లు వేయాలని లద్నూరు రిజర్వాయర్లో నీళ్లు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని ధర్మారం పిట్టల గూడానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల్లో చెక్ డ్యాముల రిపేయిర్ చేయాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూత్రశాలలు నిర్మించాలని, ప్రహరీ గోడ నిర్మించాలని, మోడల్ స్కూల్ లో మూత్రశాలలు, వంటగది నిర్మించాలని మండలంలో అర్హులైన పేదలకు పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2017 ఆగస్టు లో సిపిఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం ను ముట్టడించడంతో సమస్యలు పరిష్కరించకపోగా గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బి.ఆర్.ఎస్ నాయకులు సమస్యలు పరిష్కరించక పొగ పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లోకూడా అవినీతి అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అక్రమకేసులతో ఉద్యమాలు, పోరాటాలు ఆపలేరని తెలిపారు. చేర్యాల కోర్టుకు నేడు హాజరైన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు, సీఐటీయూ జనగామ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, మరియు సున్కోజు లక్ష్మణ, బెజాడి మల్లారెడ్డి, దొంతి రాజిరెడ్డి, దొంతి బుచ్చిరెడ్డి, గద్దల మహేందర్, అల్ద పరిపూర్ణము, పోతుగంటి సిద్ధులు, కింగర్ల రవి తదితరులు ఉన్నారు.












