ఆర్టీసీ డిఎం. సునీత ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ సిబ్బంది
ప్రజా గొంతుక న్యూస్, (జనవరి 20)సూర్యాపేట:
ఇటీవల సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన వి, సునిత ని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆమె కార్యాలయంలో ఆర్టీసీ సూపర్వైజర్ల సమక్షంలో సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బంది ముందు వరుసలో ఉన్నా రాని వివరించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టిసి బస్సులు భరోసా కల్పించేలా సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాన్నారు. అంకితభావంతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ బి. సైదులు, సూపర్వైజర్లు జి. రమశ్రీ , కె, ధనమ్మ, బి, రామయ్య, మాచర్ల భాస్కర్, ఆర్టీసీ సిబ్బంది ప్రతినిధులు సుంకరి శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, ఎండి అబ్దుల్ ఘని,పాదూరి రమేష్,విజయ ఆనంద్, విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.












