సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ప్రజాగొంతుక న్యూస్ మల్దకల్మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో ఏడు సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లి రిజర్వాయర్ లో మునిగిపోయి మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో ఇద్దరు ఆడపిల్లలు నీట మునిగి చనిపోయారు. గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప ముగ్గురు కూతుళ్లు, కుమ్మరి కృష్ణ కుమ్మరి వెంకటేష్ కూతుళ్లు 2019 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ స్థానిక రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఈతరాక గల్లంతై మరణించారు. ఈ సంఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గతంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాలని తెలుపగా ప్రభుత్వం మంగళవారం ఒక్కొక్క బాలికకు రూ.2లక్షలు చొప్పున రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతులమీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. కాగా ఏడేళ్ల తర్వాత తమకు చెక్కులు రావడానికి ప్రస్తుత సర్పంచ్ వెంకటేశ్వరమ్మ సత్యన్న ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.












