తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అనగానే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు.అలాంటి ప్రాంతంలో ఉన్న సీతయ్యగారితోటలో ఏకరాతిశిలా విగ్రహంగా కొలువైనవినాయకుడుని, తోటలో వినాయకుడుగా కొలుస్తారు భక్తులు. ఇటీవల ఆలయంపునఃనిర్మాణం జరిగింది. కాని ప్రారంభం జరగలేదు. కరోనా ప్రభావంతోముహుర్తాలు వాయిదా పడటంతో కాలం సాగిపోయింది. చివరకు గత ఏడాదికాలంపైగా ఉన్న చిన్న గుడిలో బొజ్జ గణపయ్యను ఎట్టకేలకు మూషిక పీఠంఎక్కించి అనంతరం ప్రతిష్టించారు. పిఠాపురం పట్టణంతో పాటు పరిసరప్రాంతాల భక్తులు వినాయకుడి ప్రతిష్టామహోత్సవానికి హాజరయ్యారు. ఈకార్యక్రమానికి సీతయ్యగారితోట యువత, మహిళలతోపాటు, పలువురుప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు విఘ్నేశ్వరుడిని దర్శించుకునిఆశీసులు పొందారు.












